రాజ్యసభకు టిఆర్‌యస్ అభ్యర్తుల నామినేషన్ ..!

టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు జోగినిపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు టిఆర్ఎస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.

వీరు కాక కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, మరో స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్లు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు స్థానాలను గెలుచుకునే బలం టిఆర్ఎస్ కు ఉంది. నామినేషన్ల పరిశీలన తర్వాత ముగ్గురు కంటే ఎక్కువ అభ్యర్ధులు పోటీలో ఉంటే ఈ నెల 23న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. పోటీలో ముగ్గురే మిగిలితే నామినేషన్ల పరిశీలన తర్వాత వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *