అసెంబ్లీ నుండి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ..!

శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన 11 మంది కాంగ్రెస్ నేతల్ని ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేసినట్లుగా శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అదే సమయంలో.. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్పై హెడ్ ఫోన్స్ విసిరిన ఉదంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంపత్ ల శాసనసభా సభ్యత్వాల్ని రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి.. జీవన్ రెడ్డి.. గీతారెడ్డి.. చిన్నారెడ్డి.. ఉత్తమ్కుమార్ రెడ్డి.. డీకే అరుణ.. మల్లు భట్టి విక్రమార్క.. పద్మావతి రెడ్డి.. రామ్మోహన్ రెడ్డి.. వంశీచందర్ రెడ్డి.. మాధవరెడ్డిలను సస్పెండ్ చేస్తూ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టిన తీర్మానానికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఆమోద ముద్ర వేశారు. దీంతో.. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

అటు శాసనసభతో పాటు శాసనమండిలోనూ కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది. వీరి సస్పెన్షన్‌ను మంత్రి కడియం శ్రీహరి ప్రతిపాదించగా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ ఆమోదం తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు మండలి నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారో కారణాలు చెప్పాలేదని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్ డే అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: