కాంగ్రెస్ మూకుమ్మడి రాజీనామాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనుందా..?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ సెట్ విసిరిన ఎపిసోడ్ మనకు తెలిసిందే.

అయితే శాసనసభలో నిన్న జరిగిన ఇ సంఘటనను తెలంగాణా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి.. జీవన్ రెడ్డి.. గీతారెడ్డి.. చిన్నారెడ్డి.. ఉత్తమ్కుమార్ రెడ్డి.. డీకే అరుణ.. మల్లు భట్టి విక్రమార్క.. పద్మావతి రెడ్డి.. రామ్మోహన్ రెడ్డి.. వంశీచందర్ రెడ్డి.. మాధవరెడ్డిలను సస్పెండ్ చేస్తూ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టిన తీర్మానానికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఆమోద ముద్ర వేశారు.అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంపత్ ల శాసనసభా సభ్యత్వాల్ని రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

అయితే టిపిసిసి తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్  మరియు సభ్యత్వాల రద్దుపై వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారు.

సీఎల్పీ సమావేశంలో రాజీనామాల నిర్ణయానికి మెజార్టీ సభ్యులు సానుకూలంగా స్పందించారు. అయితే సీఎల్పీ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీకి పంపించారు. ఏఐసీసీ నుంచి అనుమతి రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీలు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నారు. ఆయితే కాంగ్రేస్ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా లేదా అనేది వేచిచూడాలి..ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ ఆమోదిస్తే 13 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *