జియో నుండి సరికొత్త ఆఫర్..!

జియో ఫోన్ యూజర్లకు ఇటీవల రూ.49 ప్లాన్‌ను ప్రకటించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో గుడ్ న్యూస్‌తో ముందుకొచ్చింది. రూ.49 ప్లాన్‌ను కేవలం జియో ఫీచర్ ఫోన్‌కు మాత్రమే పరిమితం చేసిన  జియో  ఇప్పుడా ప్లాన్‌ను సవరించింది.

జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరికీ ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

అందుకోసం తొలుత ఆ సిమ్‌లను జియో ఫోన్లలో వేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అదే ఫోన్ ద్వారా ఈ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవాలి. ప్లాన్ యాక్టివేట్ అయిన తర్వాత సిమ్ తీసి వేరే ఫోన్‌లో వేసి వాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *