నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్న తమిళనాడు !!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అరవ రాజ‌కీయాల్లో ప్రభంజనం సృష్టించనున్నాడా అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రజినీకాంత్ త్వరలో   ప్రారంబించనున్న కొత్త పార్టీ కోసం ఇప్పటికే స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం ప్రారంభం అయింది .

అయితే తాజాగా రజినీకాంత్ చెన్నైలోని వెలప్పన్వాడీలో గల డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ప్రసంగించిన  ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఏమీ చేయడం లేదని అయన అన్నారు. తరుచు అధికారంలో ఉన్న  నేతలతో పాటు మరి కొందరు రాజకీయ నాయకులు  తనను ఓ విషయం అడుగుతున్నారు… సినిమా నటులు మేకప్ తీసేసి రాజకీయాల్లోకి రావడం ఎందుకని అంటున్నారని వివరించారు.

అందుకు రజినీకాంత్ సమాధానం చెప్తూ తనకు ఇప్పుడు 67 ఏళ్ల వయసని …రాజకీయ నేతలు తమ పని సరిగ్గా చేయకపోవడంతో తాను రాజకీయాల్లోకి రావలసి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో సరైన నాయకుడు ఎవరూ లేరని… ఆ లోటును తాను భర్తీ చేస్తానన్న నమ్మకం ఉందని వెల్లడించారు.

అయితే  దేవుడు తన వైపే ఉన్నాడని అయన చెప్పుకొచ్చారు . తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు  అవినీతికి తావులేకుండా..పారదర్శకమైన పరిపాలన అందిస్తామని ప్రకటించారు రజినీకాంత్ .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *