కాంగ్రెస్ మీద బురద జల్లుతే ఏమొస్తది మోదీ గారు?

2014 ఎన్నికలకు పూర్వం ఆంధ్ర ప్రదేశ్‌లో టీడిపితొ జట్టు కట్టిన మోదీ ఎన్నికల ప్రచార సమయంలో అంధ్ర ప్రదేశ్‌ను కాంగ్రెస్ అడ్డంగా విభజించిందని..ఇ విభజన వలన తెలుగు తల్లి కన్నీళ్ళు పెట్టుకుందని మొసలి కన్నీరు కర్చాడు.

అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం అని తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఒక పక్క చంద్ర బాబు మరో పక్క పవన్ కళ్యాన్‌లను పెట్టుకుని మరీ చెప్పాడు.

మోదీ మాటాలు నమ్మిన ఆంధ్ర ప్రజలు మోదీ ప్రదాని అయితే విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్‌కు మేలు జరుగుతుందని బాబూ-పవన్-మోదీల కూటమికి మొగ్గు చూపారు.

మోదీ గద్దెనెక్కగానే ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తా అని కొన్ని రోజులు కాలం గడిపాడు..ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజి అని మరి కొన్ని రోజులు టైం పాస్ చేసాడు..విశాఖకు రైల్వే జోన్ అన్నాడు . ఇలా నాలుగు సంవత్సరాల పుణ్య కాలం గడిచిపోయింది.మిగిలింది ఒకే ఒక్క సంవత్సరం.అందులోను చివరి బడ్జెట్ కుడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.. కేంధ్రంలోని మోదీ బాగస్వామ్య పార్టీ యంపీలు కేంధ్రం ఆంధ్ర ప్రదేశ్‌కు మోసం చేసిందని పార్లమెంట్‌లో నిరసనలు కూడా చెపట్టారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రధాని మోదీ బడ్జెట్ సమావేశాల సంధర్బంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై ప్రసంగించిన తీరు చూస్తే 2014 ఎన్నికలకు ముందు బారతీయులు నమ్మిన మోదీ..ఇప్పుడు ఉన్న మోదీ ఒక్కరేనా అనే సందేహం కలుగక మానదు…ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కాదని మెజారిటి బారతీయులు మొదీనికి పట్టం కట్టారు.కానీ ఇరోజు మోదీ లోక్‌సభలో మాట్లాడినిన తీరు చాలా బిన్నంగా ఉంది.

మోదీ   ఇ నాలుగు సంవత్సరాల్లొ ఆంధ్రప్రదేశ్‌కు ఎం ఓరగ బెట్టింది చెప్పకుండా  ..ఇంకా కాంగ్రెస్ పార్టీ మీదనె పడి పడి ఏడవటం చూస్తుంటే విస్మయం కలుగక మానదు.తనను నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకు తాను ఏం చేశారో తెలుపకుండా ..ఇంకా కాంగ్రెస్‌పైననే బురద చల్లటం చూస్తుంతే గడిచిన నాలుగు సంవత్సరాల్లొ మోదీ ఒరగబెట్టింది ఏమీ లేదని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *