జిగ్నేష్ ను చంపేందుకు గుజరాత్ పోలీసులు కుట్ర?

గుజరాత్‌  పోలీసులపై దళిత నాయకుడు, తాజాగా జరిగిన ఎన్నికల్లో యమ్యలేగా గెలిచిన జిగ్నేష్‌ మెవానీ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్‌ పోలీసులు తనను ఎన్‌కౌంటర్‌లో చంపాడానికి కుట్ర చేస్తున్నారని ట్వీట్‌ చేశారు. ఈ విషయం పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌ (ఏడీఆర్‌ అండ్‌ మీడియా)లో ఇద్దరి పెద్ద పోలీస్‌ అధికారుల చర్చించుకున్నట్లు జిగ్నేష్‌ పేర్కొన్నారు.

ఇటీవల ఓ దళిత కార్యకర్త మరణంతో  ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీ అహ్మదాబాద్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు మెవానీకి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ అధికారి ఈ వీడియోలను పోస్ట్‌ చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ ఎస్పీ మాత్రం కేవలం ఆ వీడియోలు ఫార్వర్డ్‌ మెసేజ్‌లేనని, వాటిలో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. దీంతో మేవానీ గుజరాత్‌ హోంమంత్రి, హోం సెక్రటరీ, డీజీపీలపై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన వెబ్‌ పోర్టల్‌ లింక్స్‌ను సైతం జత చేశారు జిగ్నేష్‌ .

Jignesh Mevani

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *