గుంటూరుకు మారనున్న పవన్ కళ్యాణ్ మకాం ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులోని ఖాజా టోల్‌గేట్‌ సమీపంలో నిర్మించనున్న కొత్త ఇంటికి సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు.

హిందూ సంప్రదాయ పద్ధతుల్లో భార్య అన్నా లెజ్నేవాతో కలిసి భూమిపూజ నిర్వహించారు.. ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం శనివారం రాత్రే భార్య.. పిల్లలతో సహా విజయవాడకు వచ్చిన పవన్.. తన రాక వివరాల్ని గోప్యంగా ఉంచారు. తన రాక విషయం బయటకు తెలిస్తే.. వెల్లువలా వచ్చే అభిమానుల తాకిడితో ఇబ్బందులు గురి అవుతాయన్న ఉద్దేశంతో వివరాల్నిబయటకు పొక్కనీయలేదని తెలుస్తోంది. పవన్‌ ఫ్యామిలీకి పోలీసులు పటిష్టభద్రతను కల్పించారు. అట్టహాసంగా జరిగిన భూమిపూజకు పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: