పెళ్ళి పీటలెక్కిన జభర్దస్త్ సుధీర్ -రేష్మీ ..!

తాజాగా సుడిగాలి సుధీర్‌, జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ర‌ష్మి వివాహం చేసుకున్నార‌ని    ఒక వీడియో నేట్టింట్లో వైరల్ అవుతుంది. ఇ వీడియో చూసిన వారందరూ ఇది నిజమేనా అని అవాక్కయ్యారు.పెళ్లి జరిగింది నిజమే అయినా ఇది రియల్ లైఫ్లో జరిగిన పెళ్లి కాదు..రీల్ లైఫ్ లో జరిగిన పెళ్లి.

సుధీర్‌, ర‌ష్మీ మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని వారిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్నార‌ని ఎప్ప‌టి నుండో ప్ర‌చారాలు జ‌రుగుతూ వ‌స్తున్నాయి. దీనిని ప‌లు సంద‌ర్భాల‌లో వారిద్ద‌రు ఖండిస్తూ వ‌చ్చిన రూమ‌ర్స్ మాత్రం ఆగ‌డం లేదు.. ఉగాది సంద‌ర్భంగా రూపొందించిన ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం సుధీర్, ర‌ష్మీల‌ని పెళ్ళి పీట‌లెక్కించి , ఆ పెళ్ళికి పెద్ద‌లుగా నాగబాబు, రోజా, ప్ర‌దీప్, జ‌బ‌ర్ధ‌స్త్ టీంని ఆహ్వానించారు. అహా నా పెళ్లంట అనే ప్రత్యేక షో కోసం రీల్ లైఫ్‌లో వారిద్ద‌రకి వివాహం జ‌రిపించారు . దీనికి సంబంధించి ఓ ప్రోమోని కూడా విడుద‌ల చేయ‌గా ఇదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *