చెలరేగిన యువ భారత్ ..!

పృథ్వీ షా నేతృత్వంలోని యువ యువ  భారత జట్టు వరల్డ్‌ కప్‌ను సాధించింది ..టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అద్భుతమైన గిఫ్ట్‌ను అందించింది.

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో భాగంగా శనివారం ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్‌కప్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది.

నాల్గోసారి వరల్‌ కప్‌ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.

ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. అండర్ 19 జట్టుకు ప్రధాన కోచ్‌గా శిక్షణ ఇస్తున్న మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకోనున్నాడు.  అండర్ 19 జట్టు ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.30 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: