చివరి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ..!

దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన చివరిదైన మూడో టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా వికెట్లను వరుసగా నేలకూల్చి 63 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన సఫారీలను 177 పరుగులకే కట్టడి చేసి చిరస్మరణీయమైన గెలుపును భారత్‌ సొంతం చేసుకుంది.

భారత్ బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి,  ఇండియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. సిరీస్‌ను 1-2తో ముగించింది. గెలుపు అవకాశాలే లేని స్థితిలోంచి బయట పడి విజయం సాధించడం అనూహ్యమే.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 187 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 247 ఆలౌట్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 194 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 177 ఆలౌట్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *