పాక్ సెనెట్‌కు తొలిసారిగా హిందూ దళిత మహిళ ..!

పాకిస్తాన్‌లో తొలిసారిగా ఓ హిందూ దళిత మహిళ సెనేటర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించింది. సింథ్‌ ప్రావిన్స్‌కు చెందిన కొహ్లీ కృష్ణ కుమారి అనే ఈ మహిళ బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ తరపున సెనేట్‌కు ఎన్నికయ్యారు.

పాకిస్తాన్‌లో మైనార్టీలు.. ముఖ్యంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తు న్నా.. ఇంతకు ముందు పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీయే తొలిసారిగా రత్నా భగవాన్‌దాస్‌ చావ్లా అనే హిందూ మహిళను సెనేట్‌కు పంపిన విషయం తెలిసిందే.
1979లో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన కృష్ణ కుమారి మూడేళ్లపాటు తన కుటుంబం, బంధువులతో కలసి ఓ ప్రైవేట్‌ జైలులో బానిసగా భ్రతికారు .

మూడేళ్ళ తరువాత  ఆ ప్రాంతంపై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడి నుంచి బయటపడ్డారు అని ఆమె చెప్పుకొచ్చారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను చిన్న పిల్లనని.. మైనార్టీ మహిళలు, చిన్నారుల కోసం పోరాటం సాగించాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారు కృష్ణ కుమారి . 16 ఏళ్ల వయసులో 9వ గ్రేడ్‌ చదువుతున్నపుడు లాల్‌ చంద్‌ను కొహ్లీతో వివాహం జరిగింది . 2013లో సింధ్‌ వర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు కొహ్లీ కృష్ణ కుమారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *