క్రికెట్ చరిత్రలో గ్రేట్ క్యాచ్ ..!

క్రికెట్ చరిత్రలోనే గొప్ప క్యాచ్. మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌​బ్యాట్స్‌మన్‌ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వాన్‌ బ్రావో, అఫ్ఘనిస్తాన్‌ యువ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడాడు.

అది గాల్లో ఉండగా బౌండరీ వద్ద  పరుగెత్తుతూ బెన్‌ లాఫ్‌లిన్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన లాఫ్‌లిన్‌ బంతిని బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి విసిరేసి పడిపోయాడు.

అయితే ఈ బంతిని జేక్‌ వెదరాల్డ్‌ చక్కటి డైవ్‌తో అందుకొని మైమరిపించాడు. ఈ బాల్ ను వెదెరాల్డ్ పట్టుకుంటాడని ఎవరూ ఊహించలేదు. లాలిన్, వెదెరాల్డ్ అద్భుతమైన డైవ్ లతో క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ క్యాచ్ రికార్డయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *