త్వరలో ఫేస్‌బుక్‌ లో మరో ఫీచర్!

ఫేస్‌బుక్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలో మరో సరి కొత్త , పవర్‌ఫుల్‌ ఫీచర్‌ ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి రానుంది. ‘వాచ్‌(Watch)’ అనే  వీడియో స్ట్రీమింగ్‌ ఫీచర్‌ను త్వరలో ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్‌ వల్ల యూజర్లు లైవ్‌ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ అమెరికాలో ఉన్న ఫేస్‌బుక్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు.

మన దేశంలో ఈ ఏడాది జూలై వరకు ఫేస్‌బుక్‌ అంచనాల ప్రకారం ఫేస్‌బుక్‌ వాడుతున్న యూజర్లు 24.1 కోట్ల వరకు ఉన్నట్టు తేలింది. అంత భారీ మార్కెట్‌ ఉన్నందునే భారత్‌లో ఫేస్‌బుక్‌ వీడియో స్ట్రీమింగ్‌ సేవలను  కూడా ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నామని ఫేస్‌బుక్‌ అధికారిక బ్లాగ్‌ ద్వారా వెల్లడించింది. యూజర్లకు బాగా నచ్చే అంశాలు కలిగిన వీడియో షోలను స్ట్రీమింగ్‌ సేవల్లో ఫేస్‌బుక్‌ అందిస్తుంది. లైఫ్‌ స్టైల్, కామెడీ, చిల్డ్రన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి విభాగాలకు సంబంధించిన వీడియోలను స్ట్రీమింగ్‌ సేవల ద్వారా అందించాలనే యోచనలో ఫేస్‌బుక్‌ ఉంది. అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది మాత్రం వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *