మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి..!

మాల్దీవుల్లో 15 రోజుల అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ప్రకటించారు. జైలులో ఉన్న విపక్ష రాజకీయ నేతలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొన్న 12 మంది ఎంపీలను మళ్లీ పదవుల్లోకి తీసుకోవాలని  ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో మాల్దావుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు అబ్దుల్లా యామీన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *