యంపీలందరూ డిల్లీలో ఉంటే ..అసెంబ్లీలో పనేంటి జేసి..!

ఓపక్క పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. ఎంపీగా ఉన్న జేసీ.. ఢిల్లీలోని జరుగుతున్న సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ.. అక్కడ డుమ్మా కొట్టిన జేసీ.. ఏపీ అసెంబ్లీ సమాశాల సందర్భంగా లాబీలకు వచ్చారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా జేసీపై బాబు సెటైర్ వేశారు.

ఏపీకి చెందిన ఎంపీలంతా ప్రత్యేకహోదా కావాలంటూ పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, సీఎంను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్తుండగా, లాబీలో ఆయనే జేసీకి ఎదురయ్యారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు’ అంటూ జేసీపై సెటైర్ వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *