పార్లమెంట్ సాక్షిగా హామీలు నీటి మూటలేనా?

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయిదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు…ఆ సంధర్బంగా పార్లమెంట్లో జరిగిన చర్చలో బీజేపి నాయకులు మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయిదు సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు..పది సంవత్సరాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు..

ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపి మరియు దాని మిత్ర పక్షాల కూటమి అయిన యన్.డి.ఏ అధికారంలోకి వచ్చి..ప్రధానిగా నరేంద్ర మోదీ భాద్యతలు చేపట్టారు. మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకొని..ఇ ప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు..ప్రత్యేక ప్యాకేజి ఇస్తాం అని ప్రకటించారు..

ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతి శంకుస్తాపనకు ముఖ్య అథితిగా వచ్చిన ప్రధాని మోదీ డిల్లీ నుండి పార్లమెంట్ ఆవరనలోని మట్టిని ..మరియు చెంబెడు నీటిని తీసుకొని వచ్చారు..ఇ సంధ్రబనగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే పార్లమెంట్ ఆవరణలోని మట్టికే అంత ప్రాధాన్యత ఉంటే మరి పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం ఇచ్చిన హామీకి  ఎంత ప్రాధాన్యత ఉండాలి..కాని ఇక్కడ మట్టికి ఉన్న విలువ ..ప్రధాని మాటకు లేదా అనే అనుమానం తలెత్తక మానదు.

ప్రస్థుత ప్రభుత్వం పార్లమెంట్ ఆవరణలోని మట్టికి ఇచ్చిన విలువ పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీకి ఇవ్వడం లేదని స్పష్టం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *