సోషల్ మీడియాపై స్పందించిన ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా సోషల్ మీడియాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సమాజాన్ని చీల్చేదే సోషల్ మీడియా అని ఆయన అన్నారు. అధికార స్థానాల్లో ఉన్నవారు సోషల్ మీడియా వాడకం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ ప్రపంచానికి విలువైన సందేశం అందించారు. మన భావాలను సోషల్ మీడియా ద్వారా వారిపై రుద్దితే అది ఒక రకంగా వారికున్న అభిప్రాయాల్ని ప్రభావితం చేసినట్లే అని ఆయన అన్నారు. ఇటీవలికాలంలో అమెరికా  అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఎక్కువగా స్పందిస్తున్న నేపద్యంలో ఆయన ఇ సంధర్బంగా ట్రంప్ కు చురకలు అంటించారని పలువురు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *